అర్జీలు సంతృప్తికరంగా పరిష్కరించాలి: ఎస్పీ
BPT: బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంతృప్తికరంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మొత్తం 59 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.