భారత్ నౌకలకు అనుమతినిచ్చాం: ఇరాన్

భారత్ నౌకలకు అనుమతినిచ్చాం: ఇరాన్

హర్మూజ్ జలసంధి నుంచి భారత్ జెండాలున్న నౌకలు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చినట్లు భారత్‌లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫత్ హలీ స్పష్టం చేశారు. భారత్ తమకు మిత్రదేశమని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ నౌకలు సురక్షితంగా వెళ్లేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇరు దేశాలు ఈ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలు కలిగి ఉన్నాయని వెల్లడించారు.