VIDEO: పెట్రోల్లో నీళ్లు.. ఆత్మకూరులో ఆందోళన

VIDEO: పెట్రోల్లో నీళ్లు.. ఆత్మకూరులో ఆందోళన

NDL: ఆత్మకూరులోని భారత్ పెట్రోల్ బంక్‌లో విక్రయిస్తున్న పెట్రోల్లో నీళ్లు కలుస్తున్నాయని ఆదివారం ఉదయం పలువురు వినియోగదారులు పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు కలిసిన పెట్రోల్ వేయడం వల్ల తమ బైకులు దెబ్బతిన్నాయని పలువురు వాపోయారు. వినియోగదారుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి, సమస్యను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.