స్థానిక సంస్థల ఎన్నికలు.. మరో UPDATE

స్థానిక సంస్థల ఎన్నికలు.. మరో UPDATE

TG: స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా పంచాయతీరాజ్ ​శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 29న కేబినెట్ భేటీ సందర్భంగా స్థానిక సంస్థల వివరాలను సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్​ సృజన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పేర్లు, వాటి సంఖ్యను మరోసారి చెక్​ చేయాలని ఆదేశించారు.