VIDEO: సామర్లకోటలో కోకనాడ ఎక్స్ ప్రెస్‌కు ఘన స్వాగతం
కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే 12715 కోకనాడ ఎక్స్ ప్రెస్‌కు బుధవారం రాత్రి సామర్లకోటలో ఘన స్వాగతం పలికారు. వారానికి మూడు రోజులు తిరిగే ఈ రైలును డైలీ ఎక్స్ ప్రెస్‌గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయించింది. స్టేషన్ మేనేజర్ రమేశ్ ఆధ్వర్యంలో లోకో పైలట్, గార్డును ఘనంగా సత్కరించారు. సామర్లకోటలో హాల్టు కల్పించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.