బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో బుకింగ్ సౌకర్యం

బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో బుకింగ్ సౌకర్యం

VZM: గ్రామాల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో కూడా స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ కె.శ్రీనివాసు అన్నారు. గురువారం గజపతినగరంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర అధ్యక్షతన గజపతినగరం సబ్ డివిజన్ సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.