రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలకి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలకి గాయాలు

సత్యసాయి: ధర్మవరం పట్టణం పోతుకుంట బి.సి కాలనీకి చెందిన గంగమ్మ అను వృద్ధురాలు గిర్రాజు కాలనీ సమీపంలో బుధవారం రాత్రి నడుచుకుంటూ రోడ్డు దాటుతూ ఉండగా కారు ఢీ కొట్టింది. గంగమ్మ ఎడమ చేతికి తీవ్రమైన గాయాలు కాగా స్థానికులు గమనించి గంగమ్మను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.