విధుల పట్ల అలసత్వం.. వార్డెన్ సస్పెండ్

విధుల పట్ల అలసత్వం.. వార్డెన్ సస్పెండ్

ప్రకాశం: విధుల పట్ల అలసత్వం వహించిన కొనకనమిట్ల సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించకపోవడంతో విద్యార్థులు పడిన ఇబ్బందులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.