"జగ్గన్నపేటలో యూరియా కొరత లేదు"

MLG: జిల్లా కేంద్రంలోని జగ్గన్నపేట గ్రామంలో యూరియా కొరత లేదని స్థానిక రైతులు సోమవారం తెలిపారు. సోషల్ మీడియాలో యూరియా సరఫరాలో ఇబ్బందులున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉదయాన్నే యూరియా లోడ్ వచ్చిందని, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్కులతో కావాల్సిన యూరియా తీసుకున్నామని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.