ఘనంగా తాతూర్ మాస వ్రత కార్యక్రమం
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని స్థానిక రామాలయంలో తాతూర్ మాస వ్రత కార్యక్రమం 21వ రోజు పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విష్ణు, బ్రహ్మ, శంకర, నవగ్రహాల కళాశాలకు ప్రత్యేక పూజలు చేసి, ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కళాశాలను పారే నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పసుల రాకేష్, దొంతుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.