వరుస దొంగతనాలు.. నలుగురి అరెస్ట్
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.80 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సిమెంట్ పనులు చేసే వారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.