సంక్షేమ పథకాన్ని తీసుకురావాలి: ఏళ్ల బయన్న

NLG: ఫోటో, వీడియో గ్రాఫర్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని తీసుకురావాలని ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్యాలలో మంగళవారం నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు. జిల్లా, మండల బాధ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.