నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమం

యాదాద్రి: బహదూర్‌పేటలో రైతులకు నానో యూరియా వాడకంపై వ్యవసాయ శాఖ అవగాహన కల్పించింది. జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణారెడ్డి నానో యూరియా ప్రయోజనాలు, వాడే విధానం గురించి వివరించారు. 45 కిలోల యూరియా బస్తాకు 500 మిల్లీ లీటర్ల నానో యూరియా సమానమని, దీని వాడకం వల్ల యూరియా వినియోగం 25-40% తగ్గి, పంట దిగుబడి పెరుగుతుందని తెలిపారు.