అధికారులు అలెర్ట్.. ఆలయాల్లో తనిఖీలు

అధికారులు అలెర్ట్.. ఆలయాల్లో తనిఖీలు

VZM: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట నేపథ్యంలో రాజాంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. రాజాంలో ఎమ్మార్వో రాజశేఖర్, ఎస్సై రవి కిరణ్ తమ సిబ్బందితో కలిసి భక్తులు రద్దీగా ఉండే దేవాలయాలను పరిశీలించారు. క్యూలైన్లు అవసరమైనన్ని ఏర్పాటుచేసి భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కల్పించాలన్నారు.