ఈనెల 24న జాబ్ మేళా
GNTR: క్రోసూరులోని గవర్నమెంట్ పాలిటిక్నికల్ కళాశాలలో 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్' ఆధ్వర్యంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో పదవ తరగతి ఉత్తీర్ణులైన లేదా డిగ్రీ వరకు చదివిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువకులు పాల్గొని తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందవచ్చని జిల్లా నైపుణ్యాభివృద్థి అధికారి తమ్మాజి రావు శనివారం తెలిపారు.