'సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

KRNL: ఎర్రగూడూరు గ్రామంలో బుధవారం అవగాహన కార్యక్రమంలో సీఐ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యాంక్ ఓటీపీ, లింకులపై జాగ్రత్త అవసరమన్నారు. డిజిటల్ అరెస్టులు, నకిలీ లోన్ యాప్స్, పెట్టుబడుల మోసాలపై హెచ్చరించారు. మహిళలపై అసభ్య ప్రవర్తనకు కఠిన చర్యలు ఉంటాయని, మద్యం సేవించి వాహనం నడిపితే కుటుంబాలు నష్టపోతాయని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే 100కు సమాచారం ఇవ్వాలన్నారు.