ఎట్టకేలకు రైతులకు బకాయిలు చెల్లింపు
NLR: బుచ్చి మండలంలోని పెనుబల్లి గ్రామంలో ఉన్న రాజేశ్వరి రైస్ మిల్లు 2017 సంవత్సరం నుంచి రైతులకు ఉన్న 70 లక్షల రూపాయల బకాయిలను తిరిగి ఇచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో తమకు న్యాయం జరిగిందన్నారు. గతంలో తమను ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదని పోలీసులను పెట్టించి తమను ఇబ్బందులకు గురి చేశారన్నారు.