రైలు ఢీకొని వ్యక్తి మృతి
ELR: రైలు పట్టాల పక్కనే బహిర్భూమికి వెళ్తున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అతని ఘటన స్థలంలోని మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఏలూరు శివారు పొట్టిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ట్రాక్మెన్ ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా మృతుడు పొట్టిపాడుకు చెందిన మజ్జి శీను (62)గా గుర్తించారు.