పెనుగంచిప్రోలులో సీఎం సహాయని చెక్కుల పంపిణీ
NTR: పెనుగంచిప్రోలు మండలంలో 23 మంది బాధితులకు రూ. 17,80,793 రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. వీటిని స్వయంగా బాధితులకు ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య అందజేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.