'సాంకేతికతతో గ్రంథాలయాల అభివృద్ధి అవసరం'
విశాఖలో గ్రంథాలయాలను సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ రాజశేఖర్ అన్నారు. ఏయూలో నిర్వహిస్తున్న కోహా సాంకేతికతపై ఐదు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రంథాలయాలు విద్యార్థులకు సమర్థ సేవలు అందించేలా ఆధునీకరణ అవసరమని, పుస్తకాలు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయాలని సూచించారు.