ఖమ్మం బస్టాండ్‌ను సందర్శించిన RTC వైస్ ఛైర్మన్
KMM: RTC వైస్ ఛైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి సోమవారం ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మం ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన కొత్త బస్టాండ్‌లోని పరిసరాలను సందర్శించారు. అనంతరం బస్టాండ్‌లో వసతులు, పరిశుభ్రత, అధికారుల పనితీరు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పూర్తిగా పరిశీలించి, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్ర సమాచారం తీసుకున్నారు.