ఆక్రమణలపై ఆర్డీవోకు వినతి

KMM: ఖమ్మం నగరంలోని అల్లీపురంలో భూ ఆక్రమణలపై రైతులు ఆర్డీవోకు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రెండేళ్లుగా గ్రామ శివారులో ఉన్న డొంకలు, వాగులపై కొంతమంది వ్యక్తులు అక్రమంగా కంచె వేసి, రైతులకు దార్లు లేకుండా ఆక్రమిస్తున్నారని, గ్రామంలోని డ్రెయినేజీ మార్గాలను కూడా కబ్జా చేశారన్నారు. ఆక్రమదారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.