అయినవిల్లి ఎస్సైగా జ్యోతి బాధ్యతలు స్వీకరణ
కోనసీమ: అయినవిల్లి నూతన ఎస్సైగా పీ.జ్యోతి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. నేరాలు నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.