VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు
ATP: రాయదుర్గం పట్టణంలో యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. బుధవారం పట్టణంలోని లక్ష్మీ బజార్ గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపు వద్ద యూరియా కోసం రైతన్నలు బారుల తీరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.