ఆస్తి కోసం తల్లి, కూతుళ్లపై దాడి

అన్నమయ్య: కొండామారిపల్లి పంచాయతీ ఇసుకనూతి పల్లికి చెందిన ఉమాదేవి తన ఇద్దరు కూతుళ్ళుకు పెళ్లి చేసి తన సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో వారి ఆస్తిపై కన్నేసిన మరిది కొడుకు చక్రపాణి రెండు రోజుల క్రితం దారి కాచి ఉమాదేవిపై దాడి చేశాడు. మంగళవారం ఉదయం కూతురు సుభాషిణిపై కూడా దాడి చేసి ఆస్తికోసం హత్య చేసేందుకు ప్రయత్నించాడని వారు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.