'నిమజ్జనం ఏర్పాట్లు చేసిన పోలీసులు'

ప్రకాశం: అద్దంకి పట్టణంలోని గుండ్లకమ్మ నదిలో వినాయకుని నిమజ్జనం చేయటానికి పోలీసులు ఏర్పాట్లు నిర్వహించారు. గుండ్లకమ్మ నదిలోకి వెళ్లే మార్గాన్ని మంగళవారం జేసీబీ సాయంతో జంగిల్ క్లియరెన్స్ నిర్వహించారు. విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.