పుంగనూరులో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయానికి పెరిగిన రద్దీ

CTR: చంద్రగ్రహణం వీడడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం అర్చకులు ఆలయాలంతా శుద్ధిచేసి పూజలు చేశారు. ఈ క్రమంలో పుంగనూరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రాహు గ్రహస్థ సోమ అపహరణ దోష నివారణ పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.