కంభంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కంభంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ప్రకాశం: కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మద్యం షాప్ వద్ద సోమవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇటీవల కాలంలో ఈ వ్యక్తి యాచకుడిగా తిరుగుతుండేవాడని స్థానికులు తెలిపారు. ఇతను మద్యం మత్తులో మృతి చెందాడ లేక గుండె పోటుతో మృతి చెందాడ అనేది తెలియాల్సి ఉంది.