‘డీలిమిటేషన్ ముడిపెట్టి మహిళలను వంచించారు’

‘డీలిమిటేషన్ ముడిపెట్టి మహిళలను వంచించారు’

TG: మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వల్లనే లోక్‌సభలో వీగిపోయిందని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. విపక్షాలు వ్యతిరేకిస్తాయని తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఈ కుట్ర చేసిందని ఆరోపించారు. 2011 సెన్సెస్ పేరుతో మహిళలను మరోసారి వంచించారని, చట్టసభల్లో మహిళా కోటాపై బీజేపీకి అసలు చిత్తశుద్ధి లేదని ఈ ఘటనతో స్పష్టమైందని మండిపడ్డారు.