ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

SDPT: హుస్నాబాద్ పట్టణంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హుస్నాబాద్ మండలంలోని మడత గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అజయ్ తన తల్లిని బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా, ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజయ్ తల్లితో పాటు మరో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.