రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.