గేట్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలి: DWRO
ASR: భూగర్భ జలాలు పెంచేందుకు నీటి భద్రత కార్యక్రమం చేపడుతున్నామని DWRO రామచంద్రరావు తెలిపారు. నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత 100రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా సోమవారం తమ శాఖ ఇంజనీర్లతో కలిసి కొయ్యూరు మండలంలో పలు సాగునీటి వనరులు పరిశీలించారు. అనంతరం ములకలపాడు చెక్ డ్యామ్‌ను పరిశీలించారు. గేట్లు మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.