రంజాన్ వేడుకలలో పాల్గొన్న కలెక్టర్

JN: రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గీతనగర్‌లోని ఖబరస్థాన్ వద్ద ఈద్గా ప్రార్థన మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనలు నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డీ.సీ.పీ. రాజమహేంద్రనాయక్, ఏ.సీ.పీ. నితిన్ చేతన్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.