యువకుడిని మోసగించిన సైబర్ నేరస్తుడు అరెస్ట్

యువకుడిని మోసగించిన సైబర్ నేరస్తుడు అరెస్ట్

ASF: గూగుల్ రివ్యూలు, క్రిప్టో పెట్టుబడుల పేరుతో సిర్పూర్ యువకుడిని మోసగించిన సైబర్ నేరస్తుడు అభిషేక్ కుమార్‌ను నోయిడాలో అరెస్టు చేసినట్లు సీఐ సంతోశ్ కుమార్ తెలిపారు. సిర్పూర్ టౌన్ ఎస్సై సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. ఈ క్రమంలో నోయిడా కోర్టులో నిందితున్ని హాజరు పరిచి, కేసు విచారణ నిమిత్తం నిందితుడిని మంగళవారం సిర్పూర్ తీసుకొచ్చారు.