మెగా డీఎస్సీలో రాణించిన కానిస్టేబుల్

ATP: పామిడి మండలానికి చెందిన కే.మహేష్ మెగా డీఎస్సీలో పీఈటీలో జిల్లా స్థాయిలో 58వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ పార్టీ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే కోరికతో కృషి చేసి లక్ష్య సాధన దిశగా ముందడుగు వేశానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.