రేపు ప్యాపిలిలో PGRS కార్యక్రమం
NDL: ప్యాపిలి మండలంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఇచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని వారి కోరారు. ఈ సమావేశానికి ఆయా శాఖ అధికారులు హాజరవుతారన్నారు.