గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
KMM: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోపాలపురం ప్రాంతంలోని కాశ్మీర్ దాబా ఎదురుగా అర్ధరాత్రి సమయంలో 22 సం.లు కలిగిన యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉందని మృతదేహాన్ని మార్చురీకి తరలించామన్నారు.