ఉన్నత విద్య స్వయం ప్రతిపత్తిపై ఆందోళన
TPT: ఉన్నత విద్యలో మార్పులపై తిరుపతి జిల్లా ఏఐఎస్ఎఫ్ నేత కోగిలి మునిచందు ఆందోళన వ్యక్తం చేశారు. APSCHE స్వయం ప్రతిపత్తి బలహీనపడుతోందని అన్నారు. ఒకే అధికారికి అధిక అధికారాలు ఇవ్వడం వల్ల అసమతౌల్యం వస్తుందని తెలిపారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయాలను పునఃసమీక్షించాలని కోరారు.