నేటి నుంచి కొండలమ్మ ఆలయంలో జాతర ప్రారంభం
MHBD: ఉగాది పండగ పురస్కరించుకుని MHBD జిల్లా కేంద్రంలోని పినిరెడ్డిగూడెం సమీపంలో ఉన్న కాకతీయ కాలం నాటి శ్రీశ్రీ కొండలమ్మ ఆలయంలో మంగళవారం నుంచి 21వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. 17న ప్రభల ఊరేగింపు, 18న పూర్ణకుంభంతో పూజలు, 19న నైవేద్య సమర్పణ, 20న మహాజాతర, 21న సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.