మడకశిర ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు
సత్యసాయి: హొట్టేబెట్ట పంచాయతీ కొడగార్లగుట్ట గ్రామానికి చెందిన 10 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే MS రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పే స్వామి ఆధ్వర్యంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.