VIDEO: లారీ ఢీకొని 25 గొర్రెలు మృతి
కొమరోలు మండలం నయారా పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి లారీ రోడ్డుపై ఉన్న గొర్రెలను ఢీకొనడంతో 25 గొర్రెలు మృతి చెందినట్లు యజమాని వాపోయాడు. దాదాపు 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. కడప నుంచి కంభం వైపు వస్తున్న లారీ నయారా పెట్రోల్ బంకు సమీపంలో గొర్రెలను ఢీకొంది. యజమాని వాహనదారుడిపై చర్యలు తీసుకుని, నష్టపరిహరం అందజేయాలన్నారు.