భయం గుప్పెట్లో చదువులు

భయం గుప్పెట్లో చదువులు

VZM: బాడంగి మండలం జీకేఆర్పరం ప్రాథమిక పాఠశాల భవనం తీవ్ర శిధిలావస్థలో ఉంది. స్లాబు నుంచి పెచ్చులు ఊడిపడుతూ లోపల ఇనుము బయటపడుతోంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే 13 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.