'పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి'

'పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి'

VZM: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని గజపతినగరం సీఐ రమణ కోరారు. మంగళవారం గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజలకు మట్టి గణపతి ప్రతిమలను సీఐ పంపిణీ చేశారు. మట్టి గణపతిలను మాత్రమే పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు.