హాకీ టర్ఫ్ కోర్టు నిర్మాణానికి చర్యలు

హాకీ టర్ఫ్ కోర్టు నిర్మాణానికి చర్యలు

AKP: ఎలమంచిలిలో హాకీ క్రీడాకారుల కోసం టర్ఫ్ కోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఎలమంచిలి హాకీ కోర్టును సందర్శించి క్రీడాకారులతో మాట్లాడారు. స్థానిక హాకీ క్రీడాకారులను అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే విధంగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. పట్టుదల క్రమశిక్షణతో సాధన చేయాలన్నారు.