ప్రమాదకరంగా మారిన డ్రైనేజీలు

KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడిపల్లి గ్రామంలో ఆరో వార్డులో డ్రైనేజీలో గడ్డి ఎక్కువగా పెరిగి నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు, క్రిమికీటకాలు చేరి జనావాసాల్లోకి వస్తున్నాయి. కావున మున్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఐటీయూసీ మధిర మండలం కార్యదర్శి వూట్ల రామకృష్ణ శనివారం డిమాండ్ చేశారు.