VIDEO: అధ్వానంగా రోడ్డు, రాత్రిపూట ప్రయాణం చేయాలంటే నరకం
SRPT: మోతే మండలం కూడలి గ్రామం నుంచి సర్వారం, బురకచర్ల వరకు గల రహదారిపై గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైందని గురువారం వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డు మొత్తం దెబ్బతిని, ప్రయాణాలు చేయాలంటే నరకం చూస్తున్నామని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపించాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు.