'కాటమయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'

'కాటమయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'

MBNR: ఏనుగొండ గుట్టపై నూతనంగా నిర్మించిన గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కాటమయ్య ఆలయంను శనివారం వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి హాజరై కాటమయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.