ఆలయ నిర్మాణానికి ఏపీ నుంచి రాతి శిలలు
GDWL: పట్టణంలోని భీమ్ నగర్ భీమశంకర ఆలయ పునర్నిర్మాణానికి ఏపీలోని ఆళ్లగడ్డలో రాతి శిలలను పరిశీలించారు. 9వ వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర కాంళ్లే, కాలనీవాసులు రాజశేఖర్ రెడ్డి, సోనీ వెంకటేష్ తదితరులు మంగళవారం ఆళ్లగడ్డ వెళ్లి శిలల దృఢత్వాన్ని తనిఖీ చేశారు. ఆలయానికి అవసరమైన రాళ్ల వివరాలను నిపుణులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని వాళ్లు తెలిపారు.