ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం..!

ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం..!

హైదరాబాద్‌లో ఊబకాయం ఆందోళనకర స్థాయికి చేరిందని 'అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026' నివేదిక వెల్లడించింది. 81.6 శాతంతో ముంబై తొలి స్థానంలో ఉండగా, 81.3 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. జంక్ ఫుడ్‌తో పాటు అతిగా స్మార్ట్‌ఫోన్ వాడకం, నిద్రలేమి ప్రధాన కారణాలు. ఫలితంగా 20 ఏళ్లకే డయాబెటిస్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, వ్యాయామం తప్పనిసరి అని హెచ్చరించారు.