కళాశాల భవనం పై నుండి దూకి విద్యార్థి దుర్మరణం

TPT: గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ విద్యార్థి భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా మనుబోలుకు చెందిన జస్వంత్ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం కళాశాల భవనం నుండి దూకి చనిపోయాడని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.